రేపు కారంచేడులో పలుచోట్ల కరెంట్ కట్
NEWS Aug 23,2024 03:40 pm
కారంచేడు విద్యుత్ ఉపకేంద్రం, గ్రామాలలో కరెంటు తీగల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. కారంచేడు మండల పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కుంకలమర్రు, కారంచేడు, స్వర్ణ గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రాంబాబు తెలిపారు. గ్రామాల పరిధిలోని ప్రజలు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.