త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తా: గొట్టిపాటి లక్ష్మి
NEWS Aug 23,2024 03:40 pm
దర్శి మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ నందు శుక్రవారం సర్పంచ్ బట్టు రామారావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని సరైన విధానంలో వినియోగించుకోవాలని అన్నారు. గ్రామంలో త్రాగు నీటి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.