రేపు కారంచేడులో పలుచోట్ల కరెంట్ కట్
NEWS Aug 23,2024 03:36 pm
కారంచేడు మండల పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ కి అంతరాయం కలగనుంది. మండలంలోని కుంకలమర్రు, కారంచేడు, స్వర్ణ గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రాంబాబు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కారంచేడు విద్యుత్ ఉపకేంద్రం, గ్రామాలలో కరెంటు తీగల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని అన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.