నైతిక విలువలతోనే సామాజిక భద్రత, గౌరవం
NEWS Aug 23,2024 03:35 pm
అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో మహిళ సాధికారత మరియు మహిళలు అలవర్చుకోవల్సిన నైతిక విలువలు అనే అంశంపై చర్చ కార్యక్రమం జరిగింది. ఈ చర్చలో ఆదివాసీ గిరిజన మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వివి జయ పాల్గొన్నారు. ఈ మేరకు వివి జయ మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన ప్రగతిని తెలియజేశారు. నైతిక విలువలు పాటించడం వలన సామాజిక భద్రత, గౌరవం పొందవచ్చని వివి జయ సూచించారు.