తిరుపతి: తిరుమలలో పుణేకు చెందిన ఓ భక్తుల బృందం అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు భారీగా బంగారు ఆభరణాలు ధరించి జిగేల్మని మెరిసిపోయారు. వారి ఒంటిపై దాదాపు 25 కిలోల బంగారం ఉన్నట్టు అంచనా. ఈ ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం వారు ఆలయం వెలుపలికి రాగా అందరి కళ్లు వాళ్లపైనే అంటే అతిశయోక్తి కాదు.