బాలికల హాస్టల్ ను తనిఖీ చేసిన మంత్రి, కలెక్టర్
NEWS Aug 23,2024 03:19 pm
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సరియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. హాస్టల్స్ లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర పాల్గొన్నారు.