హైదరాబాద్ ట్రాఫిక్‌లో రోడ్లపై డబ్బులు విసురుతూ రచ్చ చేసిన యూట్యూబర్ హర్షను పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లి, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లలో హర్షపై కేసు నమోదు కావడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యూట్యూబర్లకు తెలంగాణ పోలీస్ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా వీడియోలు చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియా వీడియోల కోసం, రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దన్నారు.