కారంచేడు-చీరాల మధ్యలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారంచేడు వైపు నుంచి చీరాల వైపు వెళుతున్న ద్విచక్ర వాహనం ఆటోను తప్పించబోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కారంచేడు ఎస్సై వెంకటరావు సంఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన ద్విచక్ర వాహనదారుడిని తన జీపులో చీరాల ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.