హుకుంపేట: శోభకోట పంచాయితీలో సర్పంచ్ శశిభూషన్ నాయుడు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు ముఖ్యఅతిధిగా మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ హజరయ్యారు. గ్రామాలను అభివృద్ధి పధంలో నడిపించడం, గ్రామ సభలను పటిష్టం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఉపాధిహామీ పధక పనులు గుర్తించాలని సూచించారు. పంచాయితీ ప్రజల నుండి పలు సమస్యల పరిష్కారానికి వినతులు స్వీకరించారు. ఎంపీపీ రాజబాబు, ఎంపీటీసీ కొమ్మ రమ తదితరులు పాల్గొన్నారు.