ఇండియా నెం.1 హీరోగా ప్రభాస్!
NEWS Aug 23,2024 02:37 pm
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాప్యులర్ మేల్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియా జాబితాలో జులై నెలకుగానూ ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. షారూక్, సల్మాన్, అక్షయ్ లను వెనక్కి నెట్టి మరీ ఇండియా నెం.1 హీరోగా అవతరించాడు ప్రభాస్. 2వ స్థానంలో విజయ్, మూడో స్థానంలో షారూక్ నిలిచారు. మహేశ్ బాబు నాలుగో స్థానంలో ఉంటే.. ఐదో స్థానంలో తారక్, ఏడో స్థానంలో అల్లు అర్జున్, 9వ స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు.