అరకులోయలో పర్యటించిన ఉపాధిహామీ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్(విజిలెన్స్)
NEWS Aug 23,2024 02:44 pm
అరకులోయ మండలంలోని చొంపి, పెదలబుడు, చినలబుడు పంచాయితీలలో ఉపాధిహామీ పధక రాష్ట్ర డిప్యూటీ కమిషనర్(విజిలెన్స్) డివి మల్లికార్జున పర్యటించారు. ఈ మేరకు 2023-24, 2024-25 సం.రాలలో రైతులకు ఇచ్చిన సిల్వర్ ఓక్ , సపోటా తోటలను పరిశీలించారు. రైతులకు మొక్కల పెంపకంలోని సస్యరక్షణ పద్దతులను వివరించారు. ఎంపీడీఓ ch.వెంకటేష్, ఏపిడి N. పవన్ కుమార్, ఏపీవో జగదీష్, ఈసీ జగదీష్, ఇతర ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు