రైలు పట్టాలపై శుక్రవారం ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. గిద్దలూరులో పట్టణ శివారులోని ఆర్మీ క్యాంటీన్ సమీపంలో గల రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని మహిళ మృతి చెంది పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.