గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తుని జీఆర్పీ ఎస్ఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. రాజమండ్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ ఎల్.మోహన్ రావు ఆదేశాల మేరకు తుని రైల్వేస్టేషన్లో ముమ్మర తనిఖీలు చేశామన్నారు. ఒకటోవ నెంబర్ ప్లాట్‌ఫాం చివరన బ్రాజేష్ అనే వ్యక్తి ఢిల్లీకి అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతడి నుంచి 6 కిలోల 400గ్రా గంజాయిని స్వాధీన పరుచుకుని సీజ్ చేశామన్నారు.