టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్
NEWS Aug 23,2024 06:10 am
టెక్సాస్‌లో 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి కాంస్య విగ్రహం కొలువుదీరింది. టెక్సాస్‌లో ఇదే అత్యంత ఎత్తైన విగ్రహం, అమెరికాలో మూడోది. దీనికి స్టాట్యూ ఆఫ్ యూనియన్ అని పేరు పెట్టారు. ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాల జాబితాలో ఇది పేరు సంపాదించుకుంది. సుగర్ ల్యాండ్‌లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో హనుమాన్ విగ్రహాన్ని శ్రీ చినజీయర్ చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. హెలికాప్టర్‌తో పైనుంచి భక్తులపై పూలు, పవిత్ర జలాన్ని చల్లారు. 72 అడుగుల దండను విగ్రహం మెడలో వేశారు.