గద్దర్ అవార్డుల కమిటీ ఏర్పాటు
NEWS Aug 22,2024 02:48 pm
హైదరాబాద్: గద్దర్ అవార్డుల కోసం కమిటీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గద్దర్ అవార్డుల కమిటీకి ఛైర్మన్‌గా బి.నర్సింగరావు, వైస్ ఛైర్మన్‌గా దిల్ రాజు, కమిటీ సలహాదారులు: కె. రాఘవేంద్రరావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల, తనికెళ్ల భరణి, డి. సురేశ్‌బాబు, చంద్రబోస్‌లను నియమించారు.