తమిళ్ స్టార్ హీరో విజయ్ తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించాడు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తానని, అంతకంటే ముందు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని స్పష్టం చేసాడు. విజయ్ తమిళ వెట్రి కజగం పార్టీ జెండా.. పైన కింద రెడ్ కలర్ తో, మధ్యలో పసుపు కలర్ తో ఉంది. మధ్యలో రెండు ఏనుగులు ఘీంకరిస్తుండగా వాటి మధ్యలో ఒక పువ్వు వికసించినట్టు, దాని చుట్టూ స్టార్స్ ఉన్నాయి.