ఆదిలాబాద్: మావల మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే (జైనథ్) బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో అనేక సమస్యలతో విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. మహాత్మ జ్యోతిబాపూలే ప్రిన్సిపాల్ వేధింపుల నుండి తమను రక్షించాలని కోరుతూ హైస్కూల్ విద్యార్థులు పోలీస్ స్టేషన్ లో మొరపెట్టుకున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటే బెదిరించి వేధిస్తున్నారని, ప్రిన్సిపాల్ సంగీత ఆగడాలు ఇక సహించే ఓపిక లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో బైఠాయించారు. నాసిరకం భోజనంపై ప్రశ్నించినందుకు తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు