మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా వస్తున్న మూవీ M4M (మోటివ్ ఫర్ మర్డర్). వసంత్ ఇసైపెట్టై అందించిన ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుం దని మోహన్ వడ్లపట్ల ప్రశంసలు కురిపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉంద న్నారు. ఇలాంటి ట్యూన్స్ ఫస్ట్ టైం అని చెప్పారు. ఈ సందర్భంగా తనకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మోహన్ వడ్లపట్లకు వసంత్ ఇసైపెట్టై కృతజ్ఞతలు తెలిపారు. 5 భాషల్లోని మూవీ టీజర్స్‌కు ఇసైపెటై ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుని అంచనాలు పెంచేసింది.