తాజాగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 126 పతకాలతో చైనాను వెనక్కు నెట్టి తొలి స్థానంలో నిలిచింది. అమెరికా 40 బంగారు పతకాలు, 44 వెండి పతకాలు, 42 కాంస్య పతకాలు సాధించింరు. బంగారు పతకాల్లో అమెరికా రికార్డును సమం చేసినప్పటికీ చైనా 91 మెడల్స్‌తో సరిపెట్టుకుంది. రెండో స్థానానికి పరిమితమైంది. ఒక్క బంగారు పతకం కూడా సాధించని భారత్ 71వ స్థానానికి పరిమితమైంది. భారత్ తన ఖాతాలో 5 కాంస్య, ఒక వెండి పతకాన్ని వేసుకుంది. అయితే, అనర్హతకు గురైన వినేశ్ ఫోగట్ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ కు అప్పీలు చేసుకోవడంతో భారత పతకాల సంఖ్య పెరగొచ్చని అంచనా.