రాయికల్: మండల కేంద్రంలో దీపావళి పండుగను మహిళలు, చిన్నారులు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నోములు, వ్రతాల్లో పాల్గొన్నారు. చిన్నారులు టపాకాయలు పేలుస్తూ, బాణసంచా వెలుగుల మధ్య కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఇళ్లన్నీ దీపాల వెలుగులతో కళకళలాడగా, పండుగ వాతావరణం నెలకొంది.