Logo
Download our app
తుపాను బాధితులకు భారీ ప్యాకేజి
NEWS   Oct 28,2026 08:48 pm
అమరావతి: అర్నబ్ తుపాను బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహార ప్యాకేజీ ప్రకటించింది. అర్హులైన ప్రతి బాధితుడికి పారదర్శకంగా సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తక్షణ సహాయం, ఇళ్ల నష్టం - మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు. - ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు 25 కేజీల బియ్యం; మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీలు. - ప్రతి కుటుంబానికి కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, చక్కెర, బంగాళదుంపలు. - కుటుంబానికి రూ. 1,000–3,000 తక్షణ ఆర్థిక సాయం. - పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ. 10,000. వ్యాపారాలు, వాహనాలు - కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, సర్వీస్ షాపులు, చేతివృత్తుల వారికి రూ. 25,000. - తోపుడు బండ్లకు రూ. 20,000. - పరిశ్రమలకు టర్నోవర్‌ను బట్టి రూ. 50,000 నుంచి రూ. 1.50 లక్షల వరకు. - ద్విచక్ర వాహనానికి రూ. 3,000; ఆటోకు రూ. 10,000. మత్స్యకారులకు - పాక్షికంగా దెబ్బతిన్న వలల మరమ్మతులకు రూ. 5,000; కొత్త వలల కోసం రూ. 10,000. - మెకనైజ్డ్ కాని బోటు, వలలు పూర్తిగా దెబ్బతింటే రూ. 20,000; మెకనైజ్డ్ బోటుకు రూ. 25,000. - చేపల చెరువుల పునరుద్ధరణకు రూ. 18,000. పశువుల నష్టం - ఆవు/గేదెకు రూ. 50,000; దూడకు రూ. 25,000. - గొర్రె/మేకకు రూ. 7,500. - కోడికి రూ. 100 (ఒక్కో లబ్ధిదారునికి గరిష్ఠంగా రూ. 10,000). - పశువుల షెడ్‌కు రూ. 5,000. పంటల నష్టపరిహారం (హెక్టారుకు) - తమలపాకుకు రూ. 75,000. - అరటి, పసుపు, మిరప, జామ, బొప్పాయి, మామిడి, కాజు తదితర పంటలకు రూ. 35,000. - వరి, పత్తి, వేరుశనగ, కూరగాయలు, పూలు తదితర పంటలకు రూ. 25,000. - చెరకు మొదటి పంటకు రూ. 25,000. - సజ్జ, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, రాగి, నువ్వులు తదితర పంటలకు రూ. 15,000. - ఆయిల్‌పామ్, కొబ్బరి చెట్టుకు రూ. 1,500. పునరుద్ధరణపై సీఎం సమీక్ష తుపాను కారణంగా ఐదుగురు మరణించడం బాధాకరమని చంద్రబాబు తెలిపారు. మూడు రోజుల్లో ఎనిమిది సమీక్షలు నిర్వహించి, సహాయక చర్యలను వేగవంతం చేశామని చెప్పారు. విద్యుత్, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్య పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నష్టంపై ప్రాథమిక నివేదికను కేంద్రానికి పంపి, కేంద్ర బృందాన్ని పంపాలని కోరినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 28,2026 09:32 pm
మాదాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌కు కంప్యూటర్ బహూకరణ
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చింతకుంట శ్రీనివాస్, వినయ కంప్యూటర్‌ను బహూకరించారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, విద్యాభివృద్ధికి కంప్యూటర్...

LATEST NEWS   Oct 28,2026 08:49 pm
వర్షంలోనూ విద్యుత్‌ అంతరాయం తొలగింపు
లక్ష్మీదేవిపల్లి: మండల పరిధిలోని హమాలీ కాలనీలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సర్పంచ్‌ ప్రేమిందర్‌ నాయక్‌ విద్యుత్‌ అంతరాయాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మూడు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు...

ENTERTAINMENT   Oct 28,2026 01:40 pm
‘రామాయణ’ ఫ‌స్ట్ రివ్యూ
రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి నటించిన ‘రామాయణ: రైజ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’ చిత్రానికి అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ ప్రీమియర్‌ అనంతరం మిశ్రమ స్పందన లభించింది. కొందరు ప్రేక్షకులు...

⚠️ You are not allowed to copy content or view source