బాలాపూర్ గణేశ్ హుండీ ఆదాయం రికార్డు
NEWS Sep 28,2026 11:01 am
బాలాపూర్ గణేశుడు లడ్డూ రూ.39 లక్షల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించగా, తాజాగా హుండీ 11 రోజులకు గాను ఏకంగా రూ.28 లక్షల 11 వేల 9 వందల 99 హుండీ ఆదాయం సమకూరింది. లడ్డూ మాదిరిగానే బాలాపూర్ హుండీ ఆదాయం సైతం ప్రతి ఏటా రికార్డులు సృష్టిస్తోంది. 2024లో రూ.18 లక్షల హుండీ ఆదాయం సమకూరగా, 2025 నాటికి రూ.5 లక్షలకు పైగా పెరిగి రూ.23,13,760 వచ్చింది. ఈ ఏడాదీ అదే పరంపర కొనసాగించి రూ.28,11,999 పలికింది.