ముంబైకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా విభిన్న అనుభవం కోసం ఒక రోజు యాచకుడి వేషధారణలో గడిపారు. రూ.3,383 కోట్లకు పైగా ఆస్తులున్న ఆయన చిరిగిన దుస్తులు ధరించి రోడ్డు పక్కన కూర్చుని భిక్షాటన చేశారు. జైన ఆధ్యాత్మిక గురువు నమ్రముని మహారాజ్ సూచన మేరకు అధికారం, విలాసాలకు దూరంగా సామాన్యుల జీవితం ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకునేందుకే ఈ అనుభవాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఘాట్‌కోపర్ ఈస్ట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షా, 2024 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువను రూ.3,383 కోట్లుగా ప్రకటించారు. భిక్షాటన అనంతరం సాధారణ దుస్తులు ధరించి స్థానికులతో ముచ్చటించారు.