కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
NEWS Sep 15,2026 12:10 am
హన్మకొండ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు త్వరలో CGHS వెల్నెస్ సెంటర్ అందుబాటులోకి రానుంది. వరంగల్‌లో సీజీహెచ్‌ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి హన్మకొండలో ప్రతిపాదిత భవనాలను పరిశీలించారు. సెంటర్ ఏర్పాటుకు అవసరమైన వసతులు, భవన పరిస్థితి, ఇతర సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెల్నెస్ సెంటర్ అందుబాటులోకి వస్తే వరంగల్, పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.