కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
NEWS Sep 10,2026 12:26 am
కరీంనగర్: కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను సీపీ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, CCTNS, e-సాక్ష్య, సమన్వయ పోర్టళ్ల నిర్వహణను సమీక్షించారు. నేర పరిశోధనలో సాంకేతికతను సమర్థంగా వాడాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర్, ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.