పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
NEWS Aug 27,2026 11:36 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని నిరసన చేపట్టారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.