అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని.. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని అన్నారు. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. బ్రిటన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రిటన్ పర్యటనకు అనుమతించారని, కానీ అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి ఇవ్వలేదన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్‌తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. తన పర్యటనలో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేశారు. ఏదైనా దాపరికం ఉందని విదేశాంగ శాఖ భావిస్తే అందుకు కారణాలను స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.