అంబేడ్కర్ విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు కడితే కఠిన చర్యలు
NEWS Aug 24,2026 05:51 pm
కరీంనగర్ రేకుర్తిలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం చుట్టూ ఉన్న రేలింగ్‌కు ఫ్లెక్సీలు, జెండాలు కడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంబేడ్కర్ సంఘం జిల్లా శాఖ హెచ్చరించింది. హెచ్చరిక బోర్డు ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు, వ్యాపార సంస్థలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.