రాయికల్: కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి
NEWS Aug 24,2026 05:42 pm
రాయికల్ పట్టణానికి చెందిన శివాజీ గోనె రెడ్డి సంఘం సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని, కమ్యూనిటీ హాల్‌కు రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరుకు కృషి చేస్తామని అన్నారు.