నేరాల నియంత్రణ, త్వరిత దర్యాప్తునకు ప్రాధాన్యం: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
NEWS Aug 19,2026 09:49 am
కరీంనగర్: నేరాల నియంత్రణతో పాటు కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమీషనరేట్‌లో నిర్వహించిన జూలై నెల నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల రక్షణ, సైబర్ నేరాలు, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జూలైలో 15 ప్రధాన కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో ప్రతిభ చూపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సీపీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు.