మెరుగైన వైద్యం అందించాలి: MLA
NEWS Aug 17,2026 11:16 pm
కొండగట్టు వద్ద సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సు–లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన 25 మందిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. గాయపడిన వారందరి పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని ఎమ్మెల్యే తెలిపారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులకు భోజన సౌకర్యం కల్పించాలని అధికారులను సూచించారు.