నాగుల పంచమి సందర్భంగా పూజలు
NEWS Aug 17,2026 11:53 pm
రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర నాగాలయంలో నాగుల పంచమి సందర్భంగా భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం ఆలయ అర్చకులు చెఱకు రాజేశ్వర శర్మ వైదిక నిర్వహణలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం చింతలపెల్లి విజయ–గంగారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, ఆలయ చైర్మన్ దానవేని రాము, ధర్మకర్తలు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు