ప్రజావాణి వినతుల పరిష్కారానికి కృషి
NEWS Aug 17,2026 11:53 pm
ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వచ్చిన వినతులను కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణిలో పాల్గొన్న జిల్లా అధికారులను ప్రజలు అందించిన వినతులపై పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.