తమకు కేటాయించిన ఇండ్లలో నివసించాలి
NEWS Aug 17,2026 11:54 pm
ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో వెంటనే నివసించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. హనుమకొండలోని శాయంపేటలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల బ్లాక్ లను కలెక్టర్ పరిశీలించారు.బ్లాక్ లను సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు.ఇప్పటివరకు ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే తమకు కేటాయించిన ఇళ్లలో నివసించాలని కోరారు.