AKP: డీఎస్సీపై చర్చకు వచ్చి ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ వైసీపీకి సవాల్ విసిరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని, ఎంపికైన టీచర్లు సైతం స్పష్టం చేస్తున్నారని అన్నారు. వైసీపీ లేనిపోని ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.