వెంకుపాలెంలో గ్రంథాలయం ప్రారంభం
NEWS Aug 17,2026 11:54 pm
అనకాపల్లి మండలం వెంకుపాలెంలో ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభించారు. విద్యార్థులు, యువతలో పఠనాసక్తి పెంపొందించడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉపయోగపడేలా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాపేటి శ్రీను, కాశీబాబా, బుద్ధా నూకన్నా, పోలమరశెట్టి సాయి గణేష్, గ్రామ పెద్దలు, యువకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.