పంచాయతీ కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలి
NEWS Aug 17,2026 11:54 pm
రోలుగుంట: గ్రామపంచాయతీ కార్మికుల 3 నుంచి 8 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు రోలుగుంట మండల కార్యాలయం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. రోడ్లు తుడుస్తూ నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రం అందించారు. హెల్త్ అలవెన్స్, యూనిఫాం, చెప్పులు, గ్లౌజులు తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోతే పనులు బంద్ చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకర్రావు, నాయకులు పాల్గొన్నారు.