చరిత్ర సృష్టించిన 'పెద్దింటి' నవల జిగిరి
NEWS Aug 16,2026 02:37 pm
ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన జిగిరి నవల సాహిత్యంలో ఒక చరిత్ర సృష్టించింది. ఈ నవల కన్నడలోకి 2వసారి అనువాదమై బెంగుళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో సాహితీ ప్రముఖుల మధ్య ఆవిష్కరణ జరిగింది. ఇదివరకే ఈ నవల 10 భాషల్లోకి అనువాదమై పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది. తెలంగాణ మారుమూల పల్లెల జీవితాన్ని ఆవిష్కరించిన ఈ నవల తెలుగు సాంస్కృతిని కన్నడ ప్రజలకు పరిచయం చేసింది.