టీడీపీలో 50 కుటుంబాల చేరిక
NEWS Aug 16,2026 05:12 pm
ఆర్. శివరాంపురం గ్రామంలో నమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నమ్మి అప్పలరాజు పేర్కొన్నారు.