వైభవంగా గంగమ్మ తల్లి బోనాలు
NEWS Aug 16,2026 04:13 pm
కరీంనగర్: జిల్లా కేంద్రంలోని బోయవాడలో గంగమ్మ తల్లి బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, బోనం ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, సర్దార్ రవీందర్ సింగ్, పొన్నం అనిల్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.