స్మార్ట్ రేషన్ కార్డుల్లో మోడీ ఫోటో ముద్రించాలి: సునీల్ రావు
NEWS Aug 16,2026 04:12 pm
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల్లో ప్రధాని మోడీ ఫోటోను ముద్రించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ కింద తెలంగాణలోని 2 కోట్ల మంది సహా దేశ వ్యాప్తంగా పేదలకు కేంద్రం ఉచితంగా బియ్యం అందిస్తోందని గుర్తుచేశారు. ఈ పథకాన్ని 2031 వరకు పొడిగించారని పేర్కొన్నారు. కేంద్రం ఉచిత బియ్యం ఇస్తున్నందున, ప్రోటోకాల్ పాటించి రేషన్ కార్డుల్లో ప్రధాని ఫోటోను చేర్చాలని కోరారు.