మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఇంటిపై
రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
NEWS Aug 16,2026 10:27 am
దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేళ జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తొయిబా టాప్ కమాండర్‌గా పేర్కొంటున్న అబిద్ రంజాన్ షేక్ ఇంటిపై అతని తల్లిదండ్రులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తమ కుమారుడు ఉగ్రవాద బాట పట్టినా, తాము మాత్రం దేశభక్తికి కట్టుబడి ఉన్నామని చాటిచెప్పారు. అబిద్ రంజాన్ POK నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం.