పేదల జీవితాల్లో వెలుగులు
NEWS Aug 16,2026 10:28 am
పేదవాడి కడుపు నింపడం, ప్రతి పేద కుటుంబానికి ఆత్మగౌరవంతో సొంతింటి నీడ కల్పించడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని ప్రభుత్వ బాధ్యతగా భావిస్తూ సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఇళ్లు, విద్య వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.