చోడవరం: రైటర్‌కు మెరిట్ సర్టిఫికెట్
NEWS Aug 16,2026 10:29 am
అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చోడవరం పోలీస్ స్టేషన్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న డి. వాసుదేవరావుకు మెరిట్ సర్టిఫికెట్ లభించింది. విధి నిర్వహణలో అంకితభావం, సమర్థవంతమైన సేవలను గుర్తించి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ పి. అప్పలరాజు, ఎస్‌ఐలు, సిబ్బంది వాసుదేవరావును అభినందించారు.