పీడీఓ అర్జయ్యకు ప్రశంసా పత్రం
NEWS Aug 16,2026 05:01 am
బుచ్చయ్యపేట మండలం, తైపురం గ్రామ పంచాయతీ పీడీఓ జి. అర్జయ్యకు విధి నిర్వహణలో అంకితభావంతో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం అందజేశారు. అనకాపల్లి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఈ. సందీప్ చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, గ్రామ అభివృద్ధిలో చూపిన ప్రత్యేక చొరవకు ఈ గుర్తింపు లభించింది.