జనగామ జిల్లాకు సర్దార్ పాపన్న గౌడ్ పేరు పెట్టాలి: మాజీ మంత్రి
NEWS Aug 10,2026 05:27 pm
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేలా జీవో జారీ చేయించామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి, రూ.3 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.