అమరావతిలో తొలి నీలిట్ క్యాంపస్
NEWS Aug 06,2026 03:06 pm
రాజధాని అమరావతిలో రూ.731.7 కోట్లతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దేశంలోనే తొలి క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది.నిడమర్రు వద్ద 10 ఎకరాలను 30 ఏళ్ల లీజుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నీలిట్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విద్య, శిక్షణ, పరిశోధనకు ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందింది.దీనికి సంబంధించి 2026 ఫిబ్రవరి 20లోనే ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఏపీ ప్రభుత్వం, నీలిట్ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ జరిగింది.