తిరుపతి కోర్టు ఆవరణలో హైడ్రామా
NEWS Aug 06,2026 02:59 pm
తిరుపతి కోర్టు ఆవరణలో హైడ్రామా చోటు చేసుకుంది. హత్య కేసులో సాక్ష్యం చెప్పాలని మల్లవరపు చిన్నా అనే వ్యక్తిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. 2019లో మురళీ అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు చిన్నా కోర్టుకు రాగా.. వైసీపీ నేతలు అపహరించి తీసుకెళ్లారు.