ఘనంగా శీతల పండుగ వేడుకలు
NEWS Aug 04,2026 06:39 pm
మెట్ పల్లి మండలం కేసీఆర్ తండాలో శీతల పండుగను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు, యువతీ యువకులు సామూహికంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ను స్మరించుకుని ప్రత్యేకంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జువ్వాడి కృష్ణారావు, అల్లూరి మహేందర్ రెడ్డి, పాల్గొన్నారు.