4 ఏళ్లలో 20 వేల ఈత మొక్కలు నాటే లక్ష్యం: సర్పంచ్ శేఖర్ గౌడ్
NEWS Aug 02,2026 12:57 pm
సిద్దిపేట: చంద్లాపూర్ గ్రామంలో నాలుగేళ్లలో 20 వేల ఈత మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ శేఖర్ గౌడ్ తెలిపారు. ప్రతి గౌడ కుటుంబం కనీసం 5 ఈత మొక్కలు నాటాల ని పిలుపునిచ్చారు. మొక్కలను ఉచితంగా అందజేస్తామన్నారు. గౌడ సంఘం భవనం వద్ద ఈత గింజలను గమనించిన ఆయన, వాటితో మొక్కలు తయారు చేసి గ్రామంలో విస్తృతంగా నాటాలని సిబ్బందికి ఆదేశించారు. గౌడ సంఘం సభ్యులు మద్దతు ప్రకటించారు.